సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (18:46 IST)

గోవుల మృతిపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు..?: వీర్రాజు

ఆర్టికల్ 370 విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని దేశాన్ని రక్షించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా పార్టీలకతీతంగా ఆర్టికల్ 370 రద్దును స్వాగతించడం అభినందనీయం అని పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో వీర్రాజు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో చర్చిలపై దాడి జరుగుతుందనగానే భద్రత కల్పించిన ప్రభుత్వం విజయవాడలో వంద గోవులు చనిపోతే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ నిధులను ఇతర అవసరాలకు వినియోగించాలని భావిస్తోందని ఆరోపించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వీర్రాజు డిమాండ్ చేశారు. అమ్మ ఒడి పథకానికే వేల కోట్లు ఖర్చు చేస్తే.. మిగతా సంక్షేమ పథకాల సంగతేంటని ప్రశ్నించారు.