మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (12:47 IST)

ఒరిజినాలిటీ లేని రాజకీయ నేత చంద్రబాబు : సోము వీర్రాజు

ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతల్లో ఒరిజినాలిటీ లేని నేత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నరు. గురువారం వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆయన శుక్రవారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 30కు మించి సీట్లు రావని తాను ఎపుడో చెప్పానన్నారు. ఎందుకంటే.. చంద్రబాబుపై నిజాయితీ లేదన్నారు. 
 
ఇకపోతే, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల గతంలో బీజేపీ, ఇపుడు జనసేన పార్టీలు తీవ్రంగా నష్టపోయినట్టు చెప్పారు. గత ఐదేళ్ళ కాలంలో ప్రజాగ్రహం తీవ్రంగా పెరిగిందన్నారు. సాక్షాత్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్‌నే చొక్కా చినిగి పోయేలా కొట్టారంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. 
 
అదేసమయంలో అత్యంత క్లిష్టసమయంలో జగన్ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారన్నారు. చంద్రబాబు జీవిత చరిత్రలో ఇప్పటివరకు 1996 ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేసి గెలుపొందారని ఆయన గుర్తుచేశారు. ఏపీలో బీజేపీ ఇపుడిపుడే తన ప్రయాణాన్ని ప్రారంభించిందని చెప్పుకొచ్చారు.