గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 14 డిశెంబరు 2020 (15:15 IST)

మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలపై బీజేవైఎం నాయకులు ఆగ్రహం

దేవదాయశాఖా మంత్రి అంటే వివాదాలకు దూరంగా ఉండాలి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గానీ.. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించడం కానీ చేయకూడదు. అలాంటిది ఎపి దేవదాయశాఖామంత్రి మాత్రం అందుకు పూర్తి విరుద్ధమని మండిపడుతున్నారు బిజెపి నేతలు.
 
నిన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు దర్గాలను అభివృద్ధి చేస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సినంత నిధులు ఖర్చు పెడతామంటూ మాట్లాడారు. హిందువులకు ప్రతినిధిగా ఉండాల్సిన వ్యక్తి వేరే మతం గురించి మాట్లాడడం.. దర్గాలను డెవలప్మెంట్ చేస్తానని చెప్పడమేమిటంటూ బిజెవైఎం నేతలు మండపడ్డారు.
 
తిరుపతిలో వెల్లంపల్లి శ్రీనివాసుల దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారు. దిష్టిబొమ్మను కాళ్లతో తన్నుతూ పోలీసులు లాక్కెళ్ళే ప్రయత్నం చేసినా అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను తగులబెట్టారు. అయితే దిష్టిబొమ్మ దహన సమయంలో బిజెవైఎం నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
 
వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాసులను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్థమవుతున్నారు.