మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (21:43 IST)

బోస్టన్ కమిటీ... ఓ బోగస్ కమిటీ: తెదేపా

రాజధానుల ప్రతిపాదనపై వైకాపా ప్రభుత్వం నియమించిన బోస్టన్ కమిటీ... ఓ బోగస్ కమిటీ అని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఎఫ్​బీఐ కేసులున్న కంపెనీకి సీబీఐ కేసులున్న వైకాపా నేతలు రాజధాని బాధ్యతుల అప్పగించారని విమర్శించారు.

విజయసాయిరెడ్డి అల్లుడికి బోస్టన్ గ్రూప్ ఛైర్మన్ మిత్రుడు కావటం వలనే రాజధానుల బాధ్యత ఆ కంపెనీకి ఇచ్చారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. రాజధానుల గురించి వేసిన బోస్టన్ కమిటీపై ఎఫ్​బీఐ కేసులు ఉన్నాయని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు.

మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎఫ్‌బీఐ కేసులు ఉన్న కంపెనీకి సీబీఐ కేసులు ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి... బాధ్యత ఇచ్చారని విమర్శించారు. ఫొక్స్‌వ్యాగన్‌, సారా కేసుల ఆరోపణలు ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ... బోస్టన్ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకుంటారా అని అనురాధ నిలదీశారు.

రాజధాని రైతులు, ఉత్తరాంధ్ర అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత కక్షని మండిపడ్డారు. రాజధాని విషయంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని వైకాపా నేతలు కొత్త కథలు చెబుతున్నారని విమర్శించారు.