ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి
వైసిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివుగా వుంటారు. అంతేకాదు మనసులో వున్న భావాలను నిర్భయంగా బైటపెట్టేస్తుంటారు. సొంత పార్టీకి చెందినవారిని విమర్శించినా ధైర్యంగానే చేస్తుంటారు. అలాగే పాలక పార్టీకి చెందిన నాయకులనైనా పొగడ్తలతో ముంచేస్తారు. దటీజ్ కేతిరెడ్డి.
ఇక అసలు విషయానికి వస్తే... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరే స్టార్స్ వున్నారని అన్నారు. ఐతే బాలయ్య హిందూపురంలో గెలవడం ఓ లెక్క ప్రకారం జరుగుతుంది. ఆయనను గుడివాడలో నిలబడి గెలవమనండి, ఆయన వల్ల కాదు అంటూ చెప్పారు. అలాగే చిరంజీవి గారు కూడా హీరోగా చిత్రాలు చేయడంతో పాటు తిరుపతిలో గెలిచారు. ఆ తర్వాత పార్టీని నడపలేకపోయారు.
వాస్తవానికి హీరోలు, స్టార్స్ ఎంతమంది వున్నా ఏపీలో మాత్రం ఇద్దరే వున్నారు. వారిలో ఒకరు పొలిటికల్ స్టార్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే రెండోవారు సినీ స్టార్ పవన్ కల్యాణ్. వీళ్లిద్దరికీ ఏపీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఎక్కడ వీరు సభ పెట్టినా పిలవకుండానే 10 వేల మంది ప్రజలు వచ్చేస్తారు. మిగిలినారెవరైనా సరే అంతా మేనేజ్మెంట్ చేసుకోవాల్సిందేనంటూ చెప్పారు.