గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (17:28 IST)

బాలుడిపై వీధికుక్కల దాడి.. పొలానికి వెళ్తే..?

విశాఖలోని అమ్మపల్లి గ్రామంలో వీధికుక్కలు తొమ్మిదేళ్ల బాలుడిని పొట్టనబెట్టుకున్నాయి. పొలానికి వెళ్తున్న బాలుడిపై శునకాలు దాడి చేశాయి. కానీ వీధికుక్కలు దాడిచేసేందుకు కారణం తెలియరాలేదు. వివరాల్లోకి వెళిత

విశాఖలోని అమ్మపల్లి గ్రామంలో వీధికుక్కలు తొమ్మిదేళ్ల బాలుడిని పొట్టనబెట్టుకున్నాయి. పొలానికి వెళ్తున్న బాలుడిపై శునకాలు దాడి చేశాయి. కానీ వీధికుక్కలు దాడిచేసేందుకు కారణం తెలియరాలేదు.

వివరాల్లోకి వెళితే.. విశాఖకు ఉత్తరంగా వున్న బలిజపేటకు సమీపంలోని అమ్మపల్లి గ్రామంలో ఆర్ జశ్వంత్‌పై వీధికుక్కలు దాడి చేశాడు. శునకాల దాడిలో గాయాలైనాయి. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయాలపాలైన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే బాలుడు ప్రాణాలు కోల్పాయాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు రోదన స్థానికులను కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.