గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2023 (11:50 IST)

పెళ్లయిన మరుసటి రోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. వరుడు షాక్!

marriage
సికింద్రాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ.. పెళ్లియిన మరుసటి రోజే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది చూసిన వరుడు తేరుకోలేని విధంగా షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సికింద్రాబాద్ నగరానికి చెందిన ఓ మహిళకు గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ వ్యక్తితో ఈ నెల 26వ తేదీన పెళ్లి జరిగింది. ఆ రోజు రాత్రే ఆమెకు కడుపునొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చెప్పిన విషయం విని వరుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కళ్లు బైర్లు కమ్మాయి. వధువు గర్భవతి అని చెప్పారు. ఆ మరుసటి రోజే వధువు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 
 
నిజానికి పెళ్లికి ముందే వధువు వ్యవహారశైలిపై వరుడు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పెళ్లి కుమార్తె పొట్ట కొంచెం పెద్దదిగా ఉండటంతో వరుడు తల్లిదండ్రులు ప్రశ్నించగా పొట్టలా రాళ్లు తీయించుకోవడానికి ఆపరేషన్ చేయించుకుందని, అందుకే కడుపు కొంచెం వాపుగా కనిపిస్తుందని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందిన వరుడు కుటుంబ సభ్యులు పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. 
 
ఇక్కడ విచిత్రమేమిటంటే తమ కుమార్తె గర్భవతి అని ఆమె తల్లిదండ్రులకు అప్పటికే తెలుసు. అయితే, ఈ విషయాన్ని వారు దాచిపెట్టారు. వధువు ప్రసవించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఆమెను కోడలిగా స్వీకరించేందుకు వరుడు తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో నోయిడా నుంచి ఆమె తల్లిదండ్రులు వధువును సికింద్రాబాద్‌కు తీసుకొచ్చారు.