అన్నకు ఉద్యోగం రాలేదని తమ్ముడు ఆత్మహత్య
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మహేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నకు ఉద్యోగం రాలేదని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే మా అన్నకు ఉద్యోగం వచ్చేదని సూసై
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మహేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నకు ఉద్యోగం రాలేదని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే మా అన్నకు ఉద్యోగం వచ్చేదని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. మహేందర్ వయస్సు 14 సంవత్సరాలు.
ఏపీకి ప్రత్యేక హోదా కోరతూ మహేందర్ ఆత్మహత్యకు పాల్పడటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదన్నారు. విద్యార్ధులు తల్లిదండ్రుల ఆశలు అడియాసలు చేయడం సరికాదన్నారు. హోదా కోసం జీవితాలను ఫణంగా పెడుతున్నా కేంద్రంలో కదలిక లేదని విమర్శించారు. పోరాటం ద్వారానే ప్రత్యేక హోదా సాధిద్దాం అని మహేంద్ర కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటాం అని తెలియజేశారు.