ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (15:58 IST)

ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్ రైలు.. ఎప్పుడొస్తుందో తెలుసా?

bullet train
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వివిధ రంగాలను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందంజలో ఉంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఏపీకి కొత్త బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది. 
 
ఇందులో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్ రైలును ప్రతిపాదించింది. ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కూటమి మంత్రులకు ఇదే విషయాన్ని తెలియజేశారు. 
 
భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ముంబై, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. ఈ మార్గంలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది 2026లో లాంచ్ అవుతుందని అంచనా. దక్షిణ భారతదేశంలోని రెండు మార్గాలు (చెన్నై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్) సహా ఏడు వేర్వేరు మార్గాల్లో బుల్లెట్ రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 
మొదట్లో ఈ రూట్లలో ఏపీ భాగం కాదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి కూడా ఒక మార్గాన్ని చేర్చాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. చెన్నై, బెంగళూరు, అమరావతి, హైదరాబాద్‌లను బుల్లెట్ రైలు మార్గంలో అనుసంధానం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. 
 
ఈ మార్గంలో కొత్త రైల్వే ట్రాక్ వేయాలని అవసరమైన అన్ని సన్నాహాలు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా దీనిపై ప్రకటన చేయాలనుకుంటోంది.