మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:17 IST)

దేవుడి దయ వల్లే ఈ అఖండ విజయం :జగన్‌

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌కు మొత్తం 13 జిల్లాలల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం ఫలితాల సరళిలో స్పష్టమైన మీదట, ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ ద్వారా రాష్ట్ర ప్రజలకు తన ధన్యవాదాలు తెలిపారు.

‘‘దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది. మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల నా బాధ్యతను మరింత పెంచాయి.

సోమవారం ఉదయం లోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి. సోమవారం ఉదయం మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను’’ అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.