సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (17:16 IST)

పశ్చిమగోదావరి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. అక్రమ సంబంధమే..?

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డి గూడెంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. మునసబు గారి వీధిలో అర్ధరాత్రి మోడల్ డైరీ డిస్ట్రిబ్యూటర్ సురేష్‌పై హత్యాయత్నం జరిగింది. 
 
గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో విచక్షణారహితంగా నరకడంతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని పోలీసులు 108 వాహనంలో ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కాగా సురేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ తరలించారు. 
 
అయితే విజయవాడలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.