గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 12 మార్చి 2018 (18:04 IST)

చంద్రబాబు నన్ను ప్రేమిస్తున్నారు... సిఎం రమేష్‌(వీడియో)

ఎవర్ని ఎవరైనా ప్రేమించవచ్చు. మగ, ఆడా మాత్రమే ప్రేమించుకోవాలా ఏంటి..అనే వారు లేకపోలేదు. రాజకీయ నాయకులు కూడా ప్రేమించుకుంటారని రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ చెప్పిన మాటలను వింటే అర్థమవుతుంది. రాజ్యసభ అభ్యర్థిగా సిఎం.రమేష్‌ ను ప్రకటించిన తరువాత తిరుమల శ్ర

ఎవర్ని ఎవరైనా ప్రేమించవచ్చు. మగ, ఆడా మాత్రమే ప్రేమించుకోవాలా ఏంటి..అనే వారు లేకపోలేదు. రాజకీయ నాయకులు కూడా ప్రేమించుకుంటారని రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ చెప్పిన మాటలను వింటే అర్థమవుతుంది. రాజ్యసభ అభ్యర్థిగా సిఎం.రమేష్‌ ను ప్రకటించిన తరువాత తిరుమల శ్రీవారి దర్సనార్థం నేరుగా తిరుపతి విమానాశ్రయానికి  చేరుకున్నారు. విమానాశ్రయంలో టిడిపి నేతలు సి.ఎం.రమేష్‌ కు ఘనస్వాగతం పలికారు.
 
అక్కడే మీడియా మాట్లాడారు సి.ఎం.రమేష్‌. చంద్రబాబుకు నేనంటే అభిమానం, ప్రేమ. అందుకే నాకు మరోసారి రాజ్యసభ సీటిచ్చారు. నాకు రాజ్యసభ సీటు ఖరారు చేయడం చాలా సంతోషంగా ఉంది. సిఎం నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ప్రత్యేకహోదా కోసం నా పోరాటం నేను కొనసాగిస్తాను. పార్లమెంటును స్థంభింపజేస్తాను అంటూ గద్గద స్వరంతో సిఎం రమేష్ అన్నారు. సిఎం చంద్రబాబునాయుడుకు నాపై ప్రేమ ఉందని చెప్పడంతో ఒక్కసారిగా మీడియాతో పాటు విమానాశ్రయంలోని ప్రయాణీకులు ఫక్కున నవ్వేశారు. చూడండి వీడియోను...