మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (17:21 IST)

నాతో ఒక్క రాత్రి గడుపు.. రూ.20లక్షలిస్తా.. సోఫియాకు ఆఫర్.. దిమ్మదిరిగే?

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు తమ ఫోటోలను, తమ సినిమా వివరాలను పోస్టు చేస్తూ వుంటారు. అయితే ఈ మధ్య సెలెబ్రిటీలకు ఫ్యాన్స్ పేరిట వేధింపులు, కించపరిచే వ్యాఖ్యలు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడిప్పుడే

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు తమ ఫోటోలను, తమ సినిమా వివరాలను పోస్టు చేస్తూ వుంటారు. అయితే ఈ మధ్య సెలెబ్రిటీలకు ఫ్యాన్స్ పేరిట వేధింపులు, కించపరిచే వ్యాఖ్యలు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ భామలు కూడా హీరోయిన్లను కించపరిచే విధంగా కామెంట్లు చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇదే తరహాలో బాలీవుడ్ నటి సోఫియా హయత్ తనను కించపరుస్తూ ఓ అభిమాని చేసిన కామెంట్లకు, ప్రశ్నలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. 
 
తనతో ఓ రాత్రి గడిపితే రూ.20లక్షల మేర ఇస్తానని ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ చేసిన ఆఫర్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. జీవితంలో అలాంటి కామెంట్లు చేయనివిధంగా సమాధానమిచ్చింది. ''రూ.20 లక్షలేంటి? రూ.20కోట్లు ఇచ్చినా నన్ను కొనలేరని.. నువ్వు ఆఫర్ చేసిన సొమ్ముతో నీ తల్లిని కొనగలవేమోనని.. ఓ సారి మీ అమ్మను అడుగు'' అంటూ రిప్లై ఇచ్చింది. 
 
అంతేకాదు.. అతడి మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. సోఫియా ఇచ్చిన సమాధానానికి ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.