సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 9 మార్చి 2018 (17:49 IST)

సప్తగిరి ఎల్ఎల్‌బి హీరోయిన్‌కు దశ తిరిగింది...

సప్తగిరి ఎల్.ఎల్.బి.సినిమాలో సప్తగిరి ప్రసాద్‌తో సమానంగా నటించింది హీరోయిన్ కషిష్ వోహ్రా. ఈ ముంబై భామ మొదటి సినిమా కూడా ఇదే. తెలుగు భాష తెలియకపోయినా ఈ సినిమాలో బాగా నటించిందన్న మంచి పేరును సంపాదించుకుంది. కానీ ఆ తరువాత ఈ హీరోయిన్‌కు అవకాశాలు బాగా తగ్

సప్తగిరి ఎల్.ఎల్.బి.సినిమాలో సప్తగిరి ప్రసాద్‌తో సమానంగా నటించింది హీరోయిన్ కషిష్ వోహ్రా. ఈ ముంబై భామ మొదటి సినిమా కూడా ఇదే. తెలుగు భాష తెలియకపోయినా ఈ సినిమాలో బాగా నటించిందన్న మంచి పేరును సంపాదించుకుంది. కానీ ఆ తరువాత ఈ హీరోయిన్‌కు అవకాశాలు బాగా తగ్గాయట. కారణం భాష రాకపోవడమే. నటన కంటే ముఖ్యం భాష తెలుసుకుని హావభావాలు పలికించాలి. ముందు అది బాగా నేర్చుకోవాలమ్మా అని దర్శకులు చెబుతున్నారట.
 
సప్తగిరి ఎల్.ఎల్.బి. తరువాత చాలామంది దర్శకులను ఈ హీరోయిన్ కలిసి అవకాశం అడిగిందట. వెళ్ళిన ప్రతి దర్శకుడు కూడా ముందు భాష నేర్చుకోమని సలహా ఇస్తున్నాడట. దీంతో తెలుగు భాష నేర్చుకునే క్లాస్‌లకు వెళ్ళడం ప్రారంభించిందట కషిష్ వోహ్రా. ఇప్పుడిప్పుడే పదాలను పలకడం ప్రారంభిస్తోందట. తెలుగు నేర్చుకోవడం ప్రారంభించగానే తెలుగులో మరో సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. 
 
కన్నడలో ఫస్ట్ ర్యాంక్ రాజు అనే సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో కషిష్‌కు అవకాశం రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవట. నాకు చాలా సంతోషంగా ఉంది.. నేను తెలుగు సినీ పరిశ్రమలోనే ఉంటానని స్నేహితులకు చెబుతోందట.