శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: ఆదివారం, 11 మార్చి 2018 (19:16 IST)

హీరోయిన్ సింధు మీన‌న్ పైన కేసు.. ఎందుకు?

చంద‌మామ సినిమాలో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న హీరోయిన్ సింధు మీన‌న్. ఆ త‌ర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో న‌టించినా ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో పెళ్లి చేసుకుని సినిమాల‌కు గుడ్ బై చెప్పేసింది. అప్ప‌టి నుంచి వార్త‌ల్ల

చంద‌మామ సినిమాలో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న హీరోయిన్ సింధు మీన‌న్. ఆ త‌ర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో న‌టించినా ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో పెళ్లి చేసుకుని సినిమాల‌కు గుడ్ బై చెప్పేసింది. అప్ప‌టి నుంచి వార్త‌ల్లో లేని సింధుమీన‌న్ పైన చీటింగ్ కేసు నమోదైంది. 
 
బెంగళూరులోని ఆర్ఎంసీ యార్డ్ పోలీస్ స్టేషనులో ఆమెతో పాటు ఆమె ముగ్గురు సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే... జుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్ఎంసీ యార్డ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి ఆమె రూ. 36 లక్షల రుణం తీసుకున్నారు. ఆ తర్వాత తీసుకున్న రుణాన్ని ఆమె చెల్లించలేదు. 
 
అంతేకాకుండా... రుణం కోసం ఆమె సమర్పించిన పత్రాలను కూడా నకిలీవిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో, బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... సింధును అరెస్ట్ చేసేందుకు యత్నించారు. ఆమె విదేశాల్లో ఉన్నందున అరెస్ట్ వీలుకాలేదు. దీంతో ఆమె సోదరుడు కార్తికేయన్‌ను అదుపులోకి తీసుకున్నారని స‌మాచారం.