'హే సెక్సీ' అంటూ ఈవ్ టీజింగ్.. రెండేళ్ళ జైలు శిక్ష విధించిన కోర్టు
'హే సెక్సీ' అంటూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడినందుకు చండీగఢ్ కోర్టు ఓ పోకిరికి రెండేళ్ళ జైలుశిక్షను విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత 2017 సెప్టెంబరు 4న బాధితురాలు కళాశాల నుంచి
'హే సెక్సీ' అంటూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడినందుకు చండీగఢ్ కోర్టు ఓ పోకిరికి రెండేళ్ళ జైలుశిక్షను విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత 2017 సెప్టెంబరు 4న బాధితురాలు కళాశాల నుంచి ఇంటికి వెళ్తూండగా సెక్టర్ 11లో డారియాకు చెందిన పంకజ్ సింగ్ అనే యువకుడు చూశాడు.
వెంటనే ఆమెను టీజింగ్ చేయడం ప్రారంభించాడు. "హే సెక్సీ" అని టీజ్ చేశాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన పంకజ్ ఆమెను చెంప దెబ్బకొట్టాడు. బాధితురాలు తన సోదరుడిని పిలిచింది. అతనిని కూడా పంకజ్ కొట్టాడు. ఆ తర్వాత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు పంకజ్‌పై కేసు నమోదుచేశారు.
ఈ కేసును విచారించిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి పూనమ్ ఆర్ జోషీ తీర్పు చెప్పారు. పంకజ్‌కు రెండేళ్ళ జైలు శిక్షతోపాటు రూ.21,000 జరిమానా కూడా విధించారు.