బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (11:22 IST)

బీచ్‌లో చీర కట్టుకుని తిరగాలా?: రాధికా ఆప్టే

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే బోల్డ్ నటి రాధికా ఆప్టే.. తాజాగా అభిమానులపై మండిపడింది. గోవా బీచ్‌లో సేదదీరిన ఫోటోను రాధికా ఆప్టే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటోపై ఫ్యాన్స్ కించ

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే బోల్డ్ నటి రాధికా ఆప్టే.. తాజాగా అభిమానులపై మండిపడింది. గోవా బీచ్‌లో సేదదీరిన ఫోటోను రాధికా ఆప్టే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటోపై ఫ్యాన్స్ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అంతే రాధికా ఆప్టే ఫైర్ అయ్యింది. తనను కించపరిచేవారి కామెంట్లను పట్టించుకోబోనని చెప్పింది. 
 
తనను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసేవాళ్లు మూర్ఖులని మండిపడింది. బీచ్‌లో సముద్రపు ఒడ్డున చీర కట్టుకుని తిరగాలని వారు అనుకుంటున్నారా? అని నిప్పులు చెరిగింది. తనను విమర్శించే వాళ్లు ఎవరో తనకు తెలియదని.. వాళ్ల గురించి పట్టించుకోనని చెప్పుకొచ్చింది. 
 
ఇక ప్యాడ్‌మ్యాన్ సినిమాలో తన నటనకు సంబంధించి వస్తున్న రివ్యూలను ఇప్పటివరకు చదవలేదని తెలిపింది. అయితే తన నటన ప్రేక్షకులకు నచ్చిందన్న విషయం తెలుసని పేర్కొంది. కాగా.. గోవా బీచ్‌లో బికినీతో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం ద్వారా రాధికా ఆప్టే ట్రోల్ అయ్యింది.