మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (16:28 IST)

రాఘవేంద్రరావు, వెంకటేశ్, సునీల్ కాంబోలో సినిమా.. ఎలా వుంటుందో?

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొత్త మూవీ రూపుదిద్దుకోనుంది. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్, స్టార్ కమెడియన్ సునీల్ నటిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆధ్య

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొత్త మూవీ రూపుదిద్దుకోనుంది. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్, స్టార్ కమెడియన్ సునీల్ నటిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆధ్యాత్మిక సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన రాఘవేంద్రరావు సక్సెస్‌ఫుల్ కమర్షియల్ చిత్రాలను కూడా ఆయన రూపొందించారు. 
 
ఈ క్రమంలో గంగోత్రి నుంచి ఓం నమో వేంకటేశాయ సినిమా వరకు భక్తిరస సినిమాలతో కమర్షియల్ హిట్ కొట్టారు. తాజాగా ఇలాంటి సినిమానే రూపొందించాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇప్పటికే వెంకీ, సునీల్ కాంబోలో రాఘవేంద్రరావు రూపొందించే సినిమా కోసం.. స్క్రిప్ట్ వర్క్ మొదలెట్టారని సమాచారం. వెంకీ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక సునీల్ కూడా హీరో పాత్రలతో పాటు కమెడియన్ పాత్రలతో బిజీబిజీగా ఉన్నాడు. త్వరలోనే సునీల్, వెంకీ, రాఘవేంద్ర రావు సినిమా సెట్స్ పైకి రానుంది.