శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2022 (00:27 IST)

కారు టాప్‌పై పవన్ జర్నీ.. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు

pawan kalyan
ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ కార్యక్రమంతో ఇళ్లు కోల్పోయిన స్థానికులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటంలో  పర్యటించారు. ఇందుకోసం వెళ్తూ పవన్ కళ్యాణ్ హైవేపై తన కారు టాప్ ఎక్కారు. కారు టాప్‌పై కూర్చుని హాయిగా జర్నీ చేశారు. 
 
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్‌పై తాడేపల్లి పీఎస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవన్ కల్యాణ్ అలా కారు టాప్‌పై జర్నీ చేస్తుంటే.. ఆయన అభిమానులు, భద్రతా సిబ్బంది కారుకు ఇరువైపులా వేలాడుతూ.. జర్నీ చేశారు. 
 
ఇలా పవన్ కల్యాణ్ చేసిన పనికి ఓ టూవీలర్ నడిపిన వ్యక్తి బైక్‌పై అదుపు తప్పి హైవేపై పడిపోయాడని ఫిర్యాదు చేశాడు. పవన్ కళ్యాణ్ చేష్టలు, ట్రాఫిక్ చట్టాలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు.