1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (10:09 IST)

'విద్యలేనివాడు విద్వాంసుల వద్ద ఉన్నంత మాత్రాన'.. వేమన విగ్రహం మార్పుపై పవన్ ట్వీట్

pawan kalyan
కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో యోగి వేమన విగ్రహాన్ని వైకాపా ప్రభుత్వం తొలగించింది. పైగా, స్థానంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించారు. యోగి వేమన విగ్రహాన్ని తీసుకెళ్లి క్యాంపస్ బయటు ప్రధాన ముఖ ద్వారం వద్ద పెట్టారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ వైకాపా ప్రభుత్వం ఏవేమీ పట్టించుకోలేదు. 
 
దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. "విష వృక్షమైన ముష్టి అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంలో లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు ఏరకంగానూ సంఘానికి ఉపయోగపడడు. పైగా హాని కూడా చేస్తాడు" అనే భావం వచ్చేలా ఉండే యోగి వేమన పద్యాన్ని పోస్ట్ చేశారు. 
 
అలాగే, "విద్య లేనివాడు విద్యాంసుల దగ్గర ఉన్నంతమాత్రాన వాడు ఎప్పటికీ విద్యాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా"అ అంటూ మరో పద్యాన్ని, తాత్పర్యాన్ని కూడా పోస్ట్ చేశారు. దీంతోపాటు యోగి వేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహం స్థానంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారంటూ వార్తా కథనాన్ని జత చేశారు.