గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 21 అక్టోబరు 2021 (15:44 IST)

ఉద్యోగుల‌కు తీపి క‌బురు... మూడు శాతం డి.ఎ. ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది మోడీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి డిఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) లను 3 శాతం పెంచడానికి ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
 
ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎను 17 శాతం నుండి 28 శాతానికి 11 శాతం పెంచిన కేంద్ర సర్కార్.. ఇవాళ మరో 3 శాతం డిఎను పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డిఎ 31 శాతానికి పెరుగుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్‌లో 3 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దసరా పండుగ మరియు దీపావళి పండుగ నేపథ్యంలో ఈ డి ఏ పెంపుపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డీఏ పెంపు నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.