గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (12:27 IST)

పుంగనూరు పొట్టి ఆవు జాతికి అరుదైన గౌరవం

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ఆవు జాతికి అరుదైన గౌరవం లభించింది. ఈ ఆవుకు మరింత గుర్తింపునిచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా, ఇటీవల పోస్టర్ శాఖ పుంగనూరు జాతి ఆవు పేరిట ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. దీంతో ఆ గ్రామం, గ్రామ చరిత్ర, ఆ గ్రామానికి చెందిన ఆవు జాతి గురించి తెలుసుకునేందుకు దేశ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. 
 
ఈ జాతి ఆవులకు మరో గుర్తింపు కూడా వచ్చింది. ప్రపంచంలోనే 70-90 సెంటీమీటర్ల ఎత్తు అంటే సుమారు రెండు అడుగుల ఎత్తు ఉండి, 115 నుంచి 200 కిలోల బరువుండే ఆవులు పుంగనూరు ఆవులుగా గుర్తింపు వచ్చింది. ఇవి లేత బూడిద, తెలుగు రంగుల్లో విశాలమైమ నుదురు, చిన్న కొమ్ములు కలిగి వుంటాయి. 
 
ఇవి రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల వరకు పాలు ఇస్తాయి. సాధారణ ఆవు పాలలో ఔషధ విలువలతో పాటు 3 నుంచి 3.5 వరకు వెన్నశాతం ఉంటుంది. అదే పుంగనూరు ఆవు పాలలో 8 శాతం ఉంటుంది. దీంతో ఈ ఆవు పాలకు మంచి ధర లభిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివిగా పేరుంది.