Omicron Variant: టాప్ 3లో తెలంగాణ, వార్ రూంలను ఏర్పాటు చేయండి: కేంద్రం
ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటివరకూ నమోదైన 215 కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 65, ఢిల్లీ 54 ఆ తర్వాత మూడో స్థానంలో 24 కేసులతో తెలంగాణ వుంది.
మరోవైపు క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే మూడురెట్లు వేగంగా విస్తరిస్తున్నట్లు గణాంకాలు చెపుతున్నాయనీ, అందువల్ల రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని సూచించింది.
కేసులను కట్టడి చేసేందుకు అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలనీ, గతంలో మాదిరిగా జనభా గుంపులుగుంపులుగా చేరకుండా చూడాలని తెలిపింది. ఇంకా ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ పరికరాలు ఇలా.. వార్ రూంలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.