గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత.. సృహ తప్పిన చదలవాడ అరవింద్ బాబు?
గుంటూరు జిల్లాలో వైఎస్సార్ విగ్రహం మాయం కావడానికి సంబంధించి ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ.. టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనలో నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవింద్‌బాబు కూడా పాల్గొన్నారు. అయితే ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబు సృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది.
దీంతో గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో శనివారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో చదలవాడ అరవింద్‌బాబును నర్సరావుపేటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే అరవింద్‌బాబును ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్‌పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించగా, మరోసారి పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.