చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల కీలక నివేదిక.. స్కిన్ అలెర్జీ..
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో నారా లోకేష్, నారా భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. మానసికంగా చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఉన్నా.. ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కీలక నివేదికను రిలీజ్ చేశారు. చంద్రబాబు చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్టు వైద్యులు నిర్దారించారు.
తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డిహైడ్రేషన్‌తో బాబు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ వైద్యులు తేల్చారు. చంద్రబాబుకు హైపర్ ట్రోఫీక్ కార్డియో మైయోపతి సమస్య వుంటుందని వ్యక్తిగత వైద్యుల సమాచారం. జైలు అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చారు.