శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 21 జులై 2020 (19:55 IST)

ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై చంద్రబాబు సీరియస్, ఛలో కావలి

నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రాబునాయుడు సీరియస్ అయ్యారు. విగ్రహం తొలగింపు అంశాన్ని సీరియస్‍గా తీసుకోవాలని నెల్లూరు నాయకులకు చంద్రబాబు సూచించారు. దీనిపై పెద్దఎత్తున పార్టీ కార్యక్రమం నిర్వహించాలని 'చలో కావలి' ఇవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
 
మంగళవారం 175 నియోజకవర్గాల ఇంచార్జిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశం చర్చకు వచ్చింది.
 కావలిలో ఎన్టీఆర్ విగ్రహం కావాలనే తొలగించారని చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తీసుకు వచ్చారు.
 
ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు పక్కనే ఉన్న స్కూలు బిల్డింగ్‍లో కూర్చుని విగ్రహాన్ని తొలగించారని, పోలీసులు కూడా సహకరించారని బీదా రవిచంద్ర, చంద్రబాబుకు తెలియజేశారు.