ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (17:11 IST)

వైఎస్ జగన్‌కు చంద్రబాబు లేఖ.. వైసీపీ నేతలే మట్టిని అక్రమంగా..?

chandra babu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. చించినాడలో దళితులపై దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. చించినాడ గ్రామంలో దళితుల భూముల్లో వైసీపీ నేతలే మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, ప్రశ్నించిన దళితులపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.  
 
చించినాడ గ్రామానికి చెందిన దళితులు ఏనుగువానిలంక గ్రామంలో గత 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ తమ అనుచరుల ద్వారా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. 
 
అక్రమ తవ్వకాలను వ్యతిరేకిస్తూ 6వ తేదీన దళితులు నిరసనకు దిగితే వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇంకా కులం పేరిట దూషించారని మండిపడ్డారు.