శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (12:14 IST)

ఎ.పి.లో ఫైబర్‌ నెట్‌ వల్ల ఎవరికి లాభమో తెలుసా? స్పెషల్ స్టోరీ

Ramasatyanarayana, naatikumar
Ramasatyanarayana, naatikumar
ఇప్పుడు సినిమాకు థియేటర్‌, ఓటీటీ, డబ్బింగ్‌ రైట్స్‌ అనేవి ఆదాయ మార్గాలుగా వున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫైబర్‌ నెట్‌ అనేది ఏర్పాటు చేసి అందులో ఒకేరోజు థియేటర్‌తోపాటు ఫైబర్‌ నెట్‌లోనూ సినిమాను విడుదల చేస్తామని అందుకు సంబంధించిన జీ.ఓ. కూడా సిద్దంగా వుందని సంబంధింత ఛైర్మన్‌ గౌతంరెడ్డి తెలిపారు. ఇటీవల తెలుగు సినిమా రంగంలోని పలువురు నిర్మాతలు దీనిపై చర్చలో పాల్గొన్నారు. ఫైనల్ గా జగన్‌ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఫైబర్‌ నెట్‌లో సినిమా అతి తక్కువ ధరకు ప్రేక్షకుడికి చేరువ చేయడమే ఉద్దేశమని పేర్కొన్నారు.
 
కానీ దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దానిపై హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌లో ఇటీవలే సమావేశం అయి చర్చించారు. ఇందులో మూడు కేటగిరి నిర్మాతలున్నారు. పెద్ద సినిమాలు తీసేవారు, మధ్యస్థం తీసేవారు, ఇక చిన్నపాటి సినిమాలు తీసేవారు మూడోరకం. ఇలా మూడు కేటగిరిలలో సినిమాలను విభజిస్తే, ఫైబర్‌ నెట్‌ వల్ల నిర్మాతకు అదనపు ఆదాయం వస్తుందనీ, కానీ ఒక్కోసారి రావచ్చు. పోవచ్చు అని సమావేశంలో తేల్చిచెప్పినట్లు తెలిసింది. 
 
చిన్న నిర్మాతల మండలికి చెందిన ఇ.సి. సభ్యులు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నట్టికుమార్‌లు దీనిపై పూర్తి విశ్లేషణాత్మకంగా వివరించారు. గతంలోనే ఈ ఫైబర్‌ నెట్‌ గురించి చందబ్రాబు ముఖ్యమంత్రి హయాంలో ప్రతిపాదన వచ్చింది. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల అది వెనుకడుగు పడింది. ఇప్పుడు ఎ.పి.లో ప్రభుత్వం పదవి కాలం ఆఖరి దశలో వుండగా ఈ నిర్ణయం తెరపైకి వచ్చింది. ఒకరకంగా నిర్మాతలను గందరగోళపరిచే అంశమే. 
 
అయిత్, ఇందులో చిన్న లాజిక్‌ వుంది. ఫైబర్‌లో నెట్‌లో 1,2 కేటగిరి చిత్రాలు అంటే భారీ బడ్జెట్‌ సినిమాలు మాత్రం నిర్మాతలు వారికి ఇవ్వరు. కేవలం మూడో కేటగిరికి చెందిన లో బడ్జెట్‌ సినిమాలే ఫైబర్‌ నెట్‌కు నిర్మాతలు ఇస్తారు. 
 
ఇక ఫైబర్‌ నెట్‌ గురించి గౌతంరెడ్డికానీ, సంబంధిత ఐ.ఎ.ఎస్‌. అధికారులకు కానీ సినిమాలపై అవగాహన లేదు. కానీ వారు దీన్ని ఎలా డీల్‌ చేస్తారనేది ప్రశ్నార్థకమే. ఎవరైనా ఇందుకు సలహాలు సూచనలు ఇవ్వాలంటే పోసాని కృష్ణమురళి, అలీవంటి వారు ప్రబుత్వ పదవిలో వున్న వారు ఇవ్వాలి. మాకు తెలిసి వారికి కూడా వీటిపై పూర్తి అవగాహన లేదనిచెప్పాలి. కనుక ఫైబర్‌ నెట్‌ అనేది ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో కాలమే నిర్ణయించాలని సమావేశంలో ఫైనల్‌ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
 
ఇక ఈ నేపథ్యంలో దీనిపై నట్టి కుమార్ స్పందిస్తూ, ``దేశంలో ఎక్కడా లేనివిధంగా సినిమా విడుదల రోజున ఏపీ ఫైబర్ నెట్ లో  కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పించబోతున్నామని ప్రభుత్వం అంటోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక నిర్మాతగా ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా  తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను వ్యతిరేకిస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమను, అలాగే నిర్మాతల మండలిని, ఫిలిం ఛాంబర్ ను సంప్రదించకుండా, జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయకుండా ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  చెపుతుందో చూడాలి.