బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2024 (18:14 IST)

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

sivaji
పోసాని కృష్ణమురళి గతంలో చేసిన వ్యాఖ్యలు, అసభ్య పదజాలం గురించి  నటుడు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ... పోసాని గారు... మీరు మంచి నటులు. మీరు ఎందుకండి కులం గురించి, చంద్రబాబు గురించి అసభ్యంగా మాట్లాడారు. కులం గురించి అంతగా బాధ వుంటే మీరు కూడా పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి.
 
నాడులన్నిటినీ కూడదీసుకుని అంత కసిగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏదైనా తప్పు వుంటే నేరుగా మాట్లాడవచ్చు. మనం సినిమా వాళ్లం కాబట్టి మన గురించి ప్రజలు ఖచ్చితంగా చెప్పుకుంటారు.
 
ఏం చెప్పుకుంటారండీ... వాడు ఆ స్కూల్లో చదివాడు, ఇలా చేసాడు అలా చేసాడు... అంటూ మంచి చేస్తే మంచివాడనీ, చెడ్డ చేస్తే చెడ్డగానే గుర్తుపెట్టుకుంటారు కదండీ. అసలు చంద్రబాబు నాయుడు, అమరావతి రాజధాని గురించి మీకు ఎందుకు అంత కసి నాకర్థం కావడంలేదు. మీరే కాదు చాలామంది ఇలా విషం వెళ్లగక్కారు. ఇప్పుడు వారిలో కొందరు వెనక్కి వెళ్లిపోతున్నారు'' అంటూ శివాజీ చెప్పుకొచ్చారు.