శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 21 నవంబరు 2024 (22:16 IST)

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

Posani Krishna murali
తన కుటుంబం కోసం రాజకీయాలకు స్వస్తి చెబుతున్నా అంటూ మీడియా ముందు చెప్పిన పోసాని కృష్ణమురళి పొలిటిక్స్ నుంచి వైదొలగడం వెనుక కారణాలను వెల్లడించాడు. '' నేను కేసులకు భయపడి ఇలా చేయడం లేదు. నా కుటుంబం కోసం రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. నేను ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేసినట్లు నిరూపిస్తే 100 పర్సంట్ జైల్లోకి వెళ్లేందుకు నేను సిద్ధం. నన్ను జైల్లో వేయండి.
 
రాజకీయాల నుంచి తప్పుకుంటా అనగానే ఒకవేళ తప్పు చేసి వుంటే పోలీసులు వదివేస్తారా? అంటే... తప్పు చేసినవాడు మంచివాడవుతాడా... నేను డబ్బు లూటి చేసి ఆ తర్వాత మోడీకి జై అంటే నన్ను వదిలేస్తారా. పోలీసు వ్యవస్థ అంత బలహీనంగా వుందా? నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేసాడని నిరూపిస్తే మాత్రం నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధం'' అంటూ చెప్పుకొచ్చాడు.
 
కాగా సోషల్ మీడియాలో ఇప్పటికీ పవన్ కల్యాణ్ పైన దారుణమైన పదజాలం ఉపయోగిస్తూ, బూతులు తిట్టిన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన కుటుంబ సభ్యులను సైతం వదలిపెట్టలేదు. వైసిపి హయాంలో ఇలా అసభ్య పదజాలం ఉపయోగించిన పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. మరికొన్నిరోజుల్లో పోసాని అరెస్ట్ ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి.