గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (16:52 IST)

ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని విన్నపం.. దొంగ ఓట్లపై నిలదీయాలి : హీరో శివాజీ

Shivaji
ప్రస్తుత రాజకీయాలపై సినీ హీరో శివాజీ సంచలన కామెంట్స్ చేశారు. సూట్ కేసులు ఇచ్చి బీఫామ్‌లు తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాగే, ఓటర్లు కూడా ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా వెలుగు చూస్తున్న దొంగ ఓట్లపై ప్రజలు నిలదీయాలని ఆయన కోరారు. దివంగత ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి దోపిడీకి తెరలేపలేదన్నారు. సహజవనరులను దోచుకోమని చెప్పలేదన్నారు. అలాంటి నాయకులు ఇపుడు లేరన్నారు. 
 
అనంతపురంలో జరిగిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని ప్రజలను కోరారు. డబ్బులు కోసం కాకుండా, మీ బిడ్డల కోసం ఓట్లు వేయాలని కోరారు. మంచి నాయకులను ఎన్నుకున్నపుడే ఎన్టీఆర్‌కు ఘన నివాళి ఇచ్చినట్టు అవుతుందన్నారు. దొంగ ఓట్లపై ప్రజలు నిలదీయాలని సూచించారు. 
 
ఇదేకార్యక్రమంలో మరో సినీ నటుడు నాగినీడు పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాను సాధించడంపై సినీ నటులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం సినీ నటులు తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు.