శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (15:13 IST)

పోలీసులపై అంతెత్తు లేచిన చిత్తూరు ఎంపి.. ఎందుకంటే..?

చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్. ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేషాలు వేసినా, నిరసన తెలిపినా దానికో లెక్క ఉంటుంది. పైగా, ఎంపీ అనే హోదాను పక్కనబెట్టి ఆయన చేసేవన్నీ వెరైటీగ

చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్. ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేషాలు వేసినా, నిరసన తెలిపినా దానికో లెక్క ఉంటుంది. పైగా, ఎంపీ అనే హోదాను పక్కనబెట్టి ఆయన చేసేవన్నీ వెరైటీగానే ఉంటాయి. పార్లమెంట్ సభ్యుడిగా కంటే ఒక మామూలు వ్యక్తిగా శివప్రసాద్ ఎప్పుడూ ఉంటారు. అందుకే శివప్రసాద్ అంటే అందరికీ సుపరిచితమే. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత, ఏపీకి నిధులు రాని సమయంలో ఇలా ఒక్కటేమిటి కేంద్రప్రభుత్వం, తెలుగుదేశం పార్టీపైనే చిత్తూరు ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. 
 
తాజాగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిరసన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శివప్రసాద్ తిరుపతిలోనే ఎక్కువగా ఉంటారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్ చిత్తూరు కావడంతో అవసరమైన కార్యక్రమాలు ఉంటే వెళ్ళి వస్తూ ఉంటారు. ఎంపి ఎక్కడికి వెళ్ళినా ఎస్కార్ట్ పెట్టి ట్రాఫిక్‌ను మళ్ళించి ఆయన్ను గమ్యస్థానానికి పోలీసులు చేర్చాలి. కానీ అవేమీ జరగడం లేదు. ఎంపీ అంటే పోలీసులకు లెక్కలేనితనంగా మారింది. 
 
ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాలంటే ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఆలస్యంగా వెళుతున్నాను. దీనికంతటికి పోలీసులే కారణమంటూ ధ్వజమెత్తారు శివప్రసాద్. చిత్తూరు పోలీస్టేషన్ ముందు తన కారులో బైఠాయించి వినూత్నంగా నిరసన తెలిపారు. 2 గంటలకు పైగా పోలీస్టేషన్ ముందు ఉన్న నడిరోడ్డుపై వాహనంలోపలే కూర్చుని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు స్వయంగా వచ్చి ఆయనకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే ఏం చేస్తానో నాకు తెలియదంటూ పోలీసులపై అంతెత్తు లేచి వెళ్ళిపోయారు శివప్రసాద్.