ఎపి రాజ్ భవన్ లో క్రిస్మస్ వేడుకలు
విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాల్ లో శుక్రవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టుకను సూచిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను ఆనందం, భక్తితో జరుపుకుంటారన్నారు.
యేసుక్రీస్తు జననం ఎంతో ప్రాముఖ్యత సంతరించు కుందని, ఆరోజు ప్రపంచ ప్రజలను వారి పాపాల నుండి విముక్తి కల్పించటానికి దేవుడు తన కుమారుడిని భూమిపైకి పంపించాడని నమ్ముతారన్నారు. తన సిలువ, తదుపరి పునరుత్థానం ద్వారా దేవుడు మానవులకు మోక్షాన్ని, నిత్యజీవనాన్ని ఇచ్చా డన్నారు.
క్రిస్మస్ అనేది ప్రజలందరిలో ప్రేమ, సహనం, కరుణ యొక్క అనుబంధాలను గురించి బోధించడానికి సంతోషకరమైన జ్ఞాపకమని, యేసుక్రీస్తు జీవితం సద్గుణ జీవితాన్ని గడపడానికి మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
సిఎస్‌ఐ ఆల్ సెయింట్స్ చర్చికి చెందిన బిషప్ జార్జ్ కార్నెలియస్ తదితరులు ప్రార్థనలు చేసి గవర్నర్‌కు ఆ శీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.