శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 జులై 2020 (09:34 IST)

ఏపీ రాజ్‌భవన్‌లో 15మంది భద్రతా సిబ్బందికి కరోనా

ఏపీ గవర్నర్‌ అధికారిక భవనమైన రాజ్‌భవన్‌ను కరోనా కమ్మేసింది. ఇక్కడ పనిచేస్తున్న వారిలో 15 మంది భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు అక్కడ పనిచేస్తున్న మొత్తం 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి మార్చి, వారి స్థానంలో కొత్త వారిని నియమించారు.

రాజ్‌భవన్‌ను పూర్తిగా శానిటైజ్‌ చేశారు. గతంలోనూ ఇక్కడ పనిచేసే పలువురు అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఏపీలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది.