ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 జులై 2020 (09:23 IST)

కర్నాటకలో టిప్పు సుల్తాన్ పై కరోనా ప్రభావం!

కరోనా దెబ్బ కర్ణాటకలో 18వ శతాబ్దానికి చెందిన మైసూర్‌ పాలకుడు టిప్పుసుల్తాన్‌ పైనా పడింది.  అక్కడి బీజేపీ ప్రభుత్వం ఏడవ తరగతి సాంఘీక శాస్త్రం నుండి టిప్పు సుల్తాన్‌ చాప్టర్‌ను తొలగించింది.

కరోనా మహమ్మారి కారణంగా 2020-21 విద్యా సంవత్సరంలో పాఠశాలలు 120 రోజులు మాత్రమే పనిచేస్తాయని, దీంతో సిలబస్‌ను తగ్గించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

కర్ణాటక టెక్ట్స్‌ బుక్‌ సొసైటీ (కెటిబిఎస్‌) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన ఏడవ తరగతి సవరించిన సిలబస్‌ ప్రకారం.. సోషల్‌ టెక్ట్‌ బుక్‌లో హైదర్‌ అలీ, టిప్పుసుల్తాన్‌ల హయాంలో నిర్మించిన మైసూర్‌ చారిత్రక స్థలాలు, పరిపాలన తీరు అనే అధ్యాయాన్ని తొలగిస్తున్నట్లు ప్రజా సమాచార శాఖ ప్రతినిధులు తెలిపారు.

కాగా, ఈ నిర్ణయంపై కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.శివకుమార్‌ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ఇటువంటి నిర్ణయం తీసుకుందని తెలిపారు.

చరిత్రలో జరిగిన దానిని మనం మార్చలేమని, టిప్పుసుల్తాన్‌ చారిత్రక వ్యక్తి అని, ఈ అధ్యాయాన్ని తొలగించడాన్ని తాము అంగీకరించలేమని, దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ ప్రభుత్వం టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలను రద్దు చేసిన విషయం తెలిసిందే.