బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శనివారం, 16 మే 2020 (10:51 IST)

కరోనా ఎఫెక్ట్: విమాన సిబ్బందికి కొత్త డ్రస్!

లాక్ డౌన్ నిబంధనల సరళీకరణ మొదలైన అనంతరం తిరిగి విమాన సర్వీసుల పునరుద్ధరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో, విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.  తమ సిబ్బందికి కరోనా వైరస్ సోకకుండా పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లు, విమానాశ్రయాల్లో పనిచేసే ఇతర సిబ్బందికి ప్రత్యేక డ్రస్ కోడ్ ను సిద్ధం చేశాయి. 
 
విమాన సిబ్బంది సురక్షితంగా ఉండేందుకు ఫేస్ షీల్డులు, గౌన్లు, మాస్క్ లు, పీపీఈ కిట్లు తదితరాలను అందించాలని నిర్ణయించామని పౌరవిమానయాన సంస్థలు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియాతో పాటు, ఇండిగో, విస్తారా, ఎయిర్ ఏసియా తదితర సంస్థలు సంయుక్తంగా ఓ నిర్ణయం తీసుకుని, కొత్త వస్త్రధారణను ఖరారు చేశాయి. 
 
ఇప్పటికే ఫిలిప్పీన్స్ ఎయిర్ ఆసియా సిబ్బంది గత నెల 27న కొత్త డ్రస్ కోడ్ లో కనిపించగా, ఆప్రాన్స్, గౌన్లు, మాస్క్ లతో విస్తారా ఎయిర్ లైన్స్ సైతం కొత్త డ్రస్ కోడ్ ను తీసుకుని వచ్చింది.

ఇప్పటికే విదేశాల నుంచి భారతీయులను ఇండియాకు చేరుస్తున్న ఎయిర్ ఇండియా సిబ్బందికి సైతం ప్రత్యేక బాడీ సూట్, ఫేస్ మాస్క్, షీల్డ్ గ్లౌజ్ లను అందించగా, త్వరలో ప్రారంభంకానున్న దేశవాళీ సేవల్లోనూ ఇదే డ్రస్ కోడ్ ను అమలు చేయనున్నారని తెలుస్తోంది.