శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 16 మే 2020 (16:11 IST)

కర్నాటకలో వచ్చే నెల 6 వరకు కోర్టులు బంద్

రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జిల్లా కోర్టులను మరికొద్ది రోజులు మూసివేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది.

వచ్చే నెల 6వ తేదీ వరకు జిల్లా కోర్టులు, ఫ్యామిలీ కోర్టులు, లేబర్‌ కోర్టులు, ఇండస్ట్రియల్‌ ట్రైబ్యునల్స్ మూసివేయాలని కోర్టు రిజిస్ట్రార్ జనరల్  శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు.

వైరస్ ఎఫెక్టుతో మే 16 వరకు కోర్టులు పనిచేయవని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ గడువు మరికొద్ది రోజులు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 67 వైరస్ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు కర్నాటకలో 35 మంది చనిపోయారు.