ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (14:01 IST)

కర్ణాటక సీఎం ఏడాది వేతనం విరాళం

కరోనా నియంత్రణ చర్యల కోసం ఎన్నో పెద్ద మనసులు స్పందిస్తున్నాయి. తమకు తోచినంత సాయం చేస్తున్నాయి. తాజాగా తన ఏడాది వేతనాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ప్రకటించారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నెల వేతనాన్ని విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యడియూరప్ప స్పందిస్తూ ట్వీట్ చేశారు. 
 
ప్రస్తుతం అందరం సమస్యను ఎదుర్కొంటున్నామని, ఇటువంటి సమయంలోనే ఐక్యంగా కరోనా వైరస్‌తో పోరాడాలని పిలుపునిచ్చారు.  తాను ఏడాది  వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నానని పేర్కొన్నారు.

ఈ వైరస్‌పై పోరుకు అందరూ సహకరించాలని కోరారు. అందరూ తమకు వీలైనంత సాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి.