కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి విరాళం
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయల వంతున ఎపి భవన్ అధికారులు రవిశంకర్, దేవేందర్ లకు, తెలంగాణ భవన్ అధికారి రామ్మోహన్ లకు అందజేశారు.
అంతేకాకుండా ప్రధానమంత్రి సహాయనిధి కూడా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. చెక్కులను అందచేస్తూ జస్టిస్ రమణ మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ ఆపత్సమయంలో ప్రజలందరూ జాగ్రత్తగా వుండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినట్లుగా అందరూ తూచా తప్పకుండా ఈ మహమ్మారిని పారద్రోలటానికి ప్రతిఒక్కరూ తమవంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.