సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (20:34 IST)

అక్షయ్ కుమార్ పెద్ద మనసు, రూ. 25 కోట్ల భారీ విరాళం

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మరోమారు తన గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా కట్టడి కోసం ఏకంగా రూ. 25 కోట్లు ప్రకటించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 కోట్ల విరాళాన్ని అందించారు.

ఇప్పటి వరకు బాలీవుడ్ నటీనటులలో ఇంతగా విరాళం ప్రకటించిన వారు లేరు. తాజాగా అక్షయ్ ప్రకటించిన విరాళంతో.. బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా దీని గురించి మాట్లాడుకునేలా చేశారు.

‘‘ప్రస్తుతం మన ప్ర‌జ‌ల జీవితాల‌ని కాపాడుకోవ‌ల‌సిన స‌మ‌యం ఇది. ఎలాంటిదైనా మ‌న‌కి తోచినంత సాయం చేయాలని కోరుతున్నాను.

నా విధిగా పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 కోట్ల విరాళాన్ని అందిస్తున్నాను. ప్రాణం ఉంటే ప్రపంచం ఉన్నట్లే.. మనల్ని మనం రక్షించుకుందాం..’’ అని అక్షయ్ తన ట్వీట్‌లో తెలిపారు.