శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2023 (17:19 IST)

ఏపీలోని మార్గదర్శి కార్యాలయాలపై దాడి

Margadarsi
భారీగా నల్లధనం మార్పిడికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాలు కేంద్ర స్థానంగా మారినట్లు సీఐడీ గుర్తించిన నేపథ్యంలో ఏపీలోని మార్గదర్శి బ్రాంచుల్లో సీఐడీ సోదాలు జరిగాయి. అక్రమ పెట్టుబడులు, డిపాజిట్లు, చందాదారుల నిధుల మళ్లింపు వంటి తదితర అభియోగాలతో ఏ1గా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చైర్మన్‌ చెరుకూరి రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైలజా కిరణ్‌, ఏ3గా బ్రాంచీ మేనేజర్లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 
 
ఈ కేసులో భాగంగా ఇటీవల రామోజీరావు, శైలజను విచారించడంతో పాటు హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా సీతంపేట, తెనాలి, ప్రొద్దుటూరు, గాజువాక బ్రాంచ్‌ల్లో సీఐడీ తనిఖీలు నిర్వహిస్తోంది. డిపాజిట్ సొమ్మును వేర్వేరు సంస్థలకు మళ్లించడంపై సోదాలు జరుపుతోంది.