ఏపీ కాకినాడలో భారీ అగ్నిప్రమాదం.. 40 బోట్లు దగ్ధం
ఏపీ కాకినాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తాళ్లరేవు మండలం కోరంగిలో ఫైబర్ బోట్ల తయారు కేంద్రంలో ఏర్పడిన భారీ అగ్నిప్రమాదంలో 40 బోట్లకు పైగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.
భారీగా ఎగసిపడుతున్న మంటలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. విషయం తెలసుకుని హుటాహుటిన ఫైర్ సర్వీస్ అధికారులు తరలివచ్చారు. మంటలు ఆర్పేశారు