4గంటల పాటు చంద్రబాబు వద్ద విచారణ.. 20 ప్రశ్నలు.. కలిసిన కుటుంబీకులు
టీడీపీ అధినేత చంద్రబాబును నాలుగు గంటల పాటు సీఐడీ ప్రశ్నించింది. సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలోని బృందం ఆయనను కార్యాలయంలోని ఐదో అంతస్థులో విచారిస్తోంది. ఈ సందర్భంగా 20 ప్రశ్నలకు పైగా ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఎస్పీజీ సెక్యూరిటీ సమక్షంలోనే ఆయన విచారణ కొనసాగుతోంది. విచారణ మధ్యలో చంద్రబాబును ఆయన న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కలిశారు.
మరోవైపు, చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు సిట్ కార్యాలయంలో చాలాసేపు వేచివుండాల్సి వచ్చింది. కుమారుడు నారా లోకేష్, సతీమణి భువనేశ్వరి నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి నలుగురూ టీడీపీ అధినేతను కలిశారు.