గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (13:53 IST)

కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటించనున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి వైఎస్ జగన్ హాజరు కానున్నారు. 
 
కర్నూలు పంచలింగాలలోని మాంటిస్సోరి పాఠశాల సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో వివాహం జరుగనుంది. వైఎస్ జగన్‌తో పాటు జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఇన్‌ఛార్జి మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్, జిల్లా ఎమ్మెల్యేలు, ఏపీ స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హాజరు కానున్నారు. 
 
కర్నూలు జిల్లా పర్యటన రాజకీయంగా కొంత ఆసక్తికరంగా ఉండేది. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే- కర్నూలులో కొంత భిన్నమైన సమీకరణాలు ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.