మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (16:14 IST)

తిరుపతిలో దారుణం.. భార్య, బావమరిదిని హత్య చేసిన వ్యక్తి

crime
ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. హత్య చేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయారు. వివరాల్లోకి వెళితే.. యువరాజు అనే వ్యక్తి తన భార్య, బావమరుదులను హత్య చేశాడు. అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.  
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి యువరాజు కుటుంబం దగ్గరకు వచ్చింది. వీరు తిరుపతిలోని ఓ హోటల్‌లో బస చేశారు. హోటల్ గదిలో వీరి మధ్య ఘర్షణ ఏర్పడింది.  
 
దీంతో విచక్షణ మర్చిపోయిన యువరాజ్ తన భార్య మనీషా, బావమరిది హర్షవర్ధన్ లను హత్య చేశాడు. భార్య, బామ్మర్ధిలను చంపిన యువరాజు అలిపిరి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. 
 
తిరుమల శ్రీవారిని దర్శించుకోవానికి వచ్చిన అన్నాచెల్లెళ్లు మనీషా, హర్షవర్ధన్‌ యువరాజు చేతిలో హత్యకు గురి కావటం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.