గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (16:56 IST)

విడాకులు తీసుకోబోతున్న హరితేజ?

Hariteja
బుల్లితెర నటి హరితేజ టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉంది. వివాదాస్పద రియాల్టీ షో బిగ్ బాస్‌లోనూ ఆమె సందడి చేసింది. 2015లో ఆమె దీపక్ అనే కన్నడ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి భూమి అనే కుమార్తె ఉంది. తాజాగా హరితేజ తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. 
 
సోషల్ మీడియాలో తన అభిమానులతో చాట్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది ఈ విషయం గురించి నేరుగా ఆమెను అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె విడాకుల వ్యవహారంపై స్పందించింది. 
 
తన భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. మరోవైపు హరితేజ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. కూతురిని తల్లి వద్ద వదిలి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.