ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (19:13 IST)

ఘోర రోడ్డు ప్రమాదం: సురక్షితంగా బయటపడిన గాయత్రీ జోషీ దంపతులు

Gayatri Joshi
Gayatri Joshi
బాలీవుడ్ నటి గాయత్రీ జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ ప్రయాణిస్తున్న కారు ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి గాయత్రీ జోషీ దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. సార్జీనియాలో లగ్జరీ కార్ల ప్రదర్శన పోటీలు జరుగుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయత్రీ జోషి, ఆమె భర్త ప్రాణాలతో బయటపడగా, స్విట్జర్లాండ్‌కు చెందిన జంట ప్రాణాలను కోల్పోయింది. 
 
పలు వాహనాలు ఒకదాన్ని ఒకటి బలంగా ఢీకొన్నాయి.  వేగంగా వెళుతూ ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.