సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Modified: శుక్రవారం, 12 నవంబరు 2021 (21:54 IST)

తిరుమ‌ల విజిలెన్స్‌ కంట్రోల్ రూం సిబ్బందిని అభినందించిన భ‌క్తురాలు: టిటిడి ఈవోకి ఇ- మెయిల్‌

హైద‌రాబాద్ మ‌ల్క‌జ్‌గిరికి చెందిన శ్రీ‌వారి భ‌క్తురాలు శ్రీ‌మ‌తి న‌వ‌త న‌వంబ‌రు 6వ తేదీ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు తిరుమ‌ల‌లో మొబైల్ ఫోన్ పోగోట్టుకున్నారు. వెంట‌నే తిరుమ‌ల‌లోని విజిలెన్స్‌ కంట్రోల్ రూంకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. కంట్రోల్ రూం సిబ్బంది వెంట‌నే స్పందించి ఆమె తిరుగాడిన ప్రాంతాల్లోని సిసి కెమెరాల పుటేజి ప‌రిశీలించి గంట‌లోపు ఆమె మొబైల్ ఫోన్‌ను గుర్తించి అప్ప‌గించారు.

 
తాను ఫిర్యాదు చేయ‌డానికి వెళ్ళిన‌ప్ప‌టి నుంచి ఫోన్ త‌న‌కు అప్ప‌గించేంత వ‌ర‌కు విజిలెన్స్‌ కంట్రోల్ రూం సిబ్బంది ఎంతో గౌర‌వంగా, స్నేహ పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆమె అభినందించారు. కంట్రోల్ రూం సిబ్బంది ఎల్ల‌వేళ‌ల ఇదేవిధంగా భ‌క్తుల‌కు సేవ‌లు అందించాల‌ని కోరారు. ఈమేర‌కు శుక్ర‌వారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి ఆమె ఇ - మెయిల్ పంపారు.