శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (14:50 IST)

రెండోసారి తల్లి అయిన కరీనా కపూర్.. పండంటి మగబిడ్డ పుట్టాడోచ్

kareena kapoor
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనా కపూర్ రెండోసారి తల్లి అయింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌తో ప్రేమలో పడిన కరీనా 2012లో ఆయనతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈ దంపతులకు 2016లో తైమూర్‌ అలీఖాన్‌ జన్మించాడు. తాను మరోసారి గర్భం దాల్చానని గతేడాది కరీనా ప్రకటించింది.
 
తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో కరీనాకు ప్రసవం జరిగిందని, మగ బిడ్డ జన్మించాడని రణ్‌ధీర్ కపూర్ వెల్లడించారు. తల్లి, బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నారని, తమ కుటుంబంలోకి మరో వ్యక్తి వచ్చి చేరారని రణ్‌ధీర్ హర్షం వ్యక్తం చేశారు. 
 
గర్భంతో ఉన్న సమయంలో కూడా ఆమిర్‌ఖాన్‌తో కలిసి `లాల్ సింగ్ చద్దా` షూటింగ్‌కు హాజరైంది. అలాగే పలు బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరించింది. కాగా, డెలివరీ తర్వాత కరీనా, చిన్నారితో కలిసి ఉన్న సైఫ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.