శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (22:28 IST)

#Welcome2021 కొత్త సంవత్సరం.. ఆరోగ్యమే మహాభాగ్యం.. వీటిని ఆచరించండి..

Happy New Year 2021
కరోనా 2020ని మొత్తంగా లాగించేసింది. 2021లో కూడా కొత్త కరోనా స్ట్రెయిన్ అనే పేరిట వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలు ఇందుకు అప్రమత్త చర్యలు తీసుకున్నాయి. భారత్‌లో ఈ కేసులు ఇప్పటికే నమోదైనాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. 
 
ఈ సందర్భంగా ఆరోగ్యంపైనే పూర్తిగా శ్రద్ధ పెట్టాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ వారు చెప్తున్నారు. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూనే కొన్ని పద్ధతులను ఆచరిస్తే.. కొత్త సంవత్సరం మీదే అవుతుందని.. మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు అంటున్నారు. అవేంటో చూద్దాం.. 
 
1. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి.
2. వ్యక్తిగత అంశాలపై శ్రద్ధ పెట్టాలి. 
3. ఎక్కువ నీరు తాగాలి.
4. విటమిన్ సి ఎక్కువగా వుండే వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. 
5. యోగా ప్రాక్టీస్ చేయాలి. ధ్యానం కూడా ఫాలో కావాలి. 
6. మొక్కలు పెంచాలి.
7. నిద్రకు సరైన సమయాన్ని కేటాయించాలి. 
8. సహనం పెంపొందించుకోవాలి.
9. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 
10. ఆరోగ్యం కోసం ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకోవాలి. 
 
 
అలాగే వ్యక్తిగత వికాసం కోసం.. 
1. చక్కని ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 
2. కొత్త స్నేహం సంపాదించాలి, 
3. ఏ రోజు ఖర్చు ఆ రోజు రాసి పెట్టుకోవాలి.
4. కెరీర్‌కి అవసరమయ్యే కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోవాలి.
5. చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా మార్చాలి.
6. సంతోషంగా వుండాలి. నవ్వుతూ పిల్లలతో గడపాలి. 
7. ఒత్తిడికి బైబై చెప్పేయాలి.  
 
8. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లతో గంటల పాటు గడపడాన్ని తగ్గించాలి. 
9. టూర్స్ ప్లాన్ చేసుకోవాలి.
10. ఇతరులకు చేతనైన సాయం చేయాలి. 
11. ఏ రోజుకు ఆ రోజు కొత్త దనం కోసం ఏదైనా ట్రై చేయాలి. 
12. పరిసరాల్లో ప్రతికూలత భావాలను తొలగించుకోవాలి. 
 
13. సమస్యలను సూనాయాసంగా అధిగమించాలి. 
14. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి. 
15. ఆరోగ్యంపైనే పూర్తి శ్రద్ధ వహిస్తూ.. జీవన వికాసానికి చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తే 2021 మీకే సొంతం అవుతుంది. సో.. ఈ చిట్కాలను పాటిస్తూ కొత్త సంవత్సరానికి సాదరంగా ఆహ్వానం పలకండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.